FbTelugu

మల్లన్నను దర్శించుకున్న ఉపాసన

చెంచులకు నిత్యావసరాల పంపిణీ

శ్రీశైలం: హీరో చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఇవాళ దర్శించుకున్నారు. చాలా రోజుల తరువాత మల్లన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆమె మీడియాతో అన్నారు.

దర్శనానంతరం ఆమె స్థానిక చెంచులు, ఆలయ ఉద్యోగులు, పోలీసులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పోలీసులకు మాస్క్ లతో పాటు పీపీఈ కిట్లను అందచేశారు. అందరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని పంపిణీ చేసే సందర్భంగా చెంచులను కోరారు. సుమారు 75 రోజుల తరువాత శ్రీశైలం దేవస్థానం ఇవాళ ప్రయోగాత్మక దర్శనాలకు అనుమతించారు. గంటకు మూడు వందల మంది చొప్పున ఆలయంలోకి అనుమతిస్తున్నారు.

You might also like