FbTelugu

ట్విటర్ ఎం.డి కి నోటీసులు

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చుట్టు ఉచ్చు బిగిస్తున్నారు. మతపరమైన అంశాంతిని రెచ్చగొట్టినందుకు పోలీసులు ఇప్పటికే ట్విటర్ తో పాటు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వారం రోజుల్లోగా లోని బోర్ర్ పోలీసు స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాలని ట్విటర్ మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్ మహేశ్వరికి నోటీసు పంపించారు. నకిలీ మంత్రం తాయత్తులు విక్రయించారనే ఆగ్రహంతో కొందరు ముస్లుంలు, హిందువులు ఘజియాబాద్ లో సుఫీ అబ్దుల్ సమద్ పై దాడి చేశారు. దాడి సందర్భంగా కొందరు వందేమాతరం, జై శ్రీరాం నినాదాలు చేశారని సమద్ ఆరోపించడంతో గొడవ మొదలైంది. ఈ వీడియో ను ట్విటర్ లో కొందరు షేర్ చేయడం తో వైరల్ అయ్యింది. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు గా స్పందించారు. ఇలాంటి వివాదాస్పద వీడియోను షేర్ చేసిన ట్విటర్ పై యుపి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వార్తను ప్రచురించిన పత్రికలు, డిజిటల్ మీడియాపై కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంలో ఎం.డి మనీశ్ మహేశ్వరిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచి పోలీసులు ప్రశ్నించారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.