FbTelugu

సుప్రీంకోర్టు సీజేని కలిసిన యూపీ సీఎస్, డీజీపీ

UP-CS-and-DGP-meet-Supreme-Court

ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ను ఉత్తర్‌ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కలిశారు. త్వరలో అయోధ్యపై తీర్పు రానున్న నేపథ్యంలో సీజేఐ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య అధికారులతో సమావేశం అయినారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల డిజిపిలను కేంద్ర హోంశాఖ అలెర్ట్ చేసింది. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో సమస్యత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. తీర్పు ఎలా ఉన్నా అన్ని వర్గాల వారు శాంతియుతముగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. సోషల్ మీడియాపై నిఘా.. హింసకు చోటు తావిచ్చే ఎలాంటి ఆసాంఘిక పోస్టులు చెయ్యకూడదని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 34 జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. తీర్పు నేపథ్యంలో అన్నీ కార్యక్రమాలను ఆర్ ఏస్ఏస్ రద్దు చేసుకుంది. హిందు, ముస్లిం మద్దతు దారులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చెయ్యవద్దని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది.

You might also like