FbTelugu

రామతీర్థానికి యూపీ సీఎం యోగి రాక

అమరావతి: రామతీర్థం వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇప్పుడు ఈ వివాదం జాతీయ స్థాయి అంశంగా మారింది. త్వరలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామతీర్థం పర్యటించనున్నట్లు తెలిసింది.

విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి ఖండిత విగ్రహం ఘటన పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ నుంచి కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. ఇవాళ ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు విజయనగరం వెళ్లి రామతీర్థం ను సందర్శించారు. అంతకు ముందే వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి సందర్శించారు. పోటాపోటీగా సందర్శించడంతో రణరంగాన్ని తలపించింది. బీజేపీ నాయకులు కూడా ఆందోళన నిర్వహించడంతో రాజకీయ వేడిని రగిలించింది. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.