FbTelugu

ఆ పసి ‘‘గంగా’’ బాధ్యత మాదే: యుపి సిఎం

లక్నో: ఘాజీపూర్ లో గంగానదిలో ఒక చెక్కపెట్టెలో తేలియాడుతూ ఒక పసికందు వచ్చిన ఘటనపై యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. పాప బాధ్యతను పూర్తిగా చూసుకుంటామని ఆయన ప్రకటించారు.
సదర్ కొత్వాలి ప్రాంతంలో దాద్రి ఘాట్ వద్ద పడవ నడిపే ఒక వ్యక్తి గుల్లు సింగ్ ఒక చెక్కపెట్టె చూశాడు. దగ్గరికి వెళ్లి చూడగా అందులో ఉన్న పసికందు ఏడుపులు విన్పించాయి.

బిడ్డతో పాటు కనకదుర్గ అమ్మవారి ఫొటోను పెట్టింది. పుట్టిన తేదీ ప్రకారం గంగా అని పేరు పెట్టినట్లు చిట్టీ ఉంది. ఇది చూసి, ఈ వివరాలను స్థానిక అధికారులకు తెలియచేయగా, ఆశాజ్యోతి కేంద్రానికి తరలించారు. 22 రోజుల పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ బిడ్డను తానే పెంచుకుంటానని గుల్లు సింగ్ చెప్పగా పోలీసులు నిరాకరించారు. ఎవరు వదిలారు, ఎందుకు వదిలారనే దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.