FbTelugu

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుండి ఇలా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడొచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏపీపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్ర, శనివారాల్లో జిల్లాల్లో వానలు కురుస్తాయి. తెలంగాణలోనూ ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో శుక్రవారం దక్షిణ కోస్తాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో పంటలు చేతికి అందివచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.

హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల శనివారం కూడా వర్షాలు కురుస్తాయని అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.