FbTelugu

అప్పటి వరకు నేనే సీఎం… గవర్నర్ కు వినతి

Until-then-I-am-the-CM--Request-to-the-Governor

ముంబై: ఆ రెండు పార్టీల పంచాయతీ ఇప్పట్లో తెగేట్టు లేదు. కావున ఆ పంచాయతీ పూర్తయ్యే వరకు తనను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ఒక వ్యక్తి ఏకంగా మహారాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చారు. మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు పూర్తయి పది రోజులు అవుతున్నా బీజేపీ, శివసేన పార్టీల మధ్య పొత్తులు కుదరలేదు. సీఎం కుర్చీ తమకు కావాలంటే తమకు కావాలంటూ కీచులాడుకుంటున్నాయి. ఎవరికి వారుగా బహిరంగ ప్రకటనలు చేసుకుంటున్నారు. దీంతో మహారాష్ట్రలో పరిపాలన స్థంభించింది. దీనిపై ఆగ్రహం చెందిన రైతు శ్రీకాంత్ విష్ణు గాడ్లే మహారాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రం పంపించారు. రెండు పార్టీల మధ్య సమస్య పరిష్కారం అయ్యే వరకు తనను సీఎం సీట్లో కూర్చోబెట్టాలని కోరారు.

You might also like