FbTelugu

రైతుల ఆందోళనపై యూఎన్ఓ కీలక వ్యాఖ్యలు

న్యూయార్క్: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల చేపట్టిన ఆందోళనపై ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా ఆందోళనలు చేసుకునే హక్కు రైతులకు ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం వారిని అడ్డుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత పదిరోజులుగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు ఇంకా ఆందోళనను విరమించలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.