FbTelugu

కరోనాపై అనవసర రాజకీయం: ఈటల

హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులపై కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు.

ప్రభుత్వం పని చేయకుండా చేస్తున్నారని, ఇది ఎంతమాత్ర మంచి పద్దతికాదు అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కరోనా పై సోషల్ మీడియాలో ఆధారం లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై ప్రేమ ఉంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి కాని ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదని మంత్రి ఈటల అన్నారు.

వలస కూలీలు, ఇత రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా ఎక్కువ పాజిటవ్ కేసులు వచ్చాయని అన్నారు. గాంధీ లోనూటికి నూరు శాతం మంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నామన్నారు. డాక్టర్లు, మెడికల్ సిబ్బంది కి అన్ని ఎక్విప్ మెంట్స్ ఇస్తున్నామన్నారు. డాక్టర్లు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు. కరోనా రోగుల సేవలో పనిచేసే వారికి ఇచ్చే పీపీఈ కిట్లు 10లక్షలకు పైనా తమ దగ్గర ఉన్నాయన్నారు. 11 లక్షల ఎన్-95 మాస్క్ లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.

తెలంగాణలో ప్లాస్మా థెరపీ విజయవంతం చేశామని, ఇప్పటికీ 5 మందికి ప్లాస్మా ఇచ్చామని ఆయన వివరించారు. ప్లాస్మా థెరపీ చేయించుకున్న ఒకరిని డిశ్చార్జ్ కూడా చేశామన్నారు. ఎంత మందికి కరోనా వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 150 వెంటిలేటర్స్ కొత్తగా సమకూర్చుకున్నామన్నారు. వైద్య సిబ్బంది నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. 3000 మంది వైద్యులు, వైద్య సిబ్బందిని నియామకం చేసుకుంటున్నామని ఈటల అన్నారు.

You might also like