FbTelugu

అన్‌లాక్‌ – 2 మార్గదర్శకాలు జారీ

ఢిల్లీ: కంటైన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్రం మర్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలో అన్‌లాక్‌ – 2 విధివిధానాలను కేంద్రం ప్రకటించింది.
కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు మేరకు అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై కొనసాగుతున్న నిషేధం. సామాజిక, రాజకీయ, మత పరమైన కార్యకలాపాలకు నిషేధం కొనసాగింపు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించారు. నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగింపు. కేంద్రం మార్గదర్శకాల మేరకు విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు అవకాశం. బయట తిరిగే వారు ముఖమంతా మాస్కు కప్పుకుని ఉండాల్సిందే. ప్రయాణ సమయం మొత్తం ప్రయాణికులు మాస్క్‌ ధరించి ఉండాల్సిందే.
ప్రతి ప్రదేశంలో 6 అడుగుల దూరాన్ని పాటించాలి. దుకాణాలన్నీ కేంద్రం మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేయాలి. ఎక్కువ సంఖ్యలో గుమిగూడటంపై నిషేధం కొనసాగింపు. వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదు

అంత్యక్రియల్లో 20 మందికి మాత్రమే అనుమతించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్‌, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం. అవకాశం మేరకు ఇంటి నుంచి పని చేసేందుకే ప్రయాత్నించాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.