FbTelugu

వైరస్ పుట్టుక చైనాలోనే: అమెరికా

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ ఆధీనంలోని లారెన్స్ లివర్ మోర్ చైనా ల్యాబ్ నుంచే వైరస్ లీకైందనే వార్త సత్యమని నిర్థారణకు వచ్చింది. గతేడాది మే నెలలోనే నిర్థారించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం ప్రచురించింది.
లారెన్స్ లివర్ మోర్ నివేదిక ఆధారంగానే తన చివరి రోజుల్లో డోనాల్డ్ ట్రంప్ విచారణకు ఆదేశించారని పేర్కొంది. వైరస్ మూలాలపై స్పష్టత లేకపోవడంతో నూతన అధ్యక్షుడు జోసెఫ్ ఆర్. బైడెన్ కనిపెట్టే యత్నం మొదలుపెట్టారు. వైరస్ మూలాలను తొందరగా కనిపెట్టాలని నిఘా సంస్థలను ఆదేశించారు.

చైనా ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు కరోనా వైరస్ లీకు అయ్యిందా, వైరస్ సోకిన జంతువు నుంచి మనిషికి సోకిందా అనే అంశాలపై నిగ్గు తేల్చాలని బైడెన్ స్పష్టం చేశారు. బైడెన్ ఆదేశంతో నిఘా సంస్థలు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. లారెన్స్ నిఘా విభాగం అయిన జెడ్ డివిజన్ వైరస్ పై లోతుగా విచారణ జరపింది. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందనే వాదన కరెక్టు అనే నిర్థారణకు వచ్చింది. మహమ్మారి ఎలా వచ్చిందనే వాదనపై అమెరికా ప్రభుత్వం జరిపిన తొలి విచారణ ఇదే. ఈ నివేదిక గతేడాది అక్టోబర్ లో విదేశాంగ శాఖ కు చేరింది. విచారణ పలితాలు రావడంతో విదేశాంగ శాఖ దీనిపై ఎక్కువ దృష్టి సారించింది. ఈ వాదనకు బలం చేకూరేలా మరిన్ని ఆధారాలను విదేశాంగ శాఖ జనవరి 15న మరో నివేదికను తయారు చేసి వైట్ హౌస్ కు చేరవేసింది. ఈ నివేదికల ఆధారంగానే డోనాల్డ్ ట్రంప్… పలు సందర్భాల్లో చైనాపై విరుచుకుపడ్డారు. ఆగ్రహం తట్టుకోలేక ఆయన కరోనా వైరస్ చైనా పేర్లు పెట్టారు. ఈ వారం అమెరికాలో జరిగిన రిపబ్లికన్ల సమావేశంలో మళ్లీ ట్రంప్ చైనా దేశంపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.