FbTelugu

చైనా రాయబార కార్యలయం మూసేయాలి: యూఎస్

వాషింగ్టన్: హూస్టన్ లోని చైనా రాయబార కార్యాలయాన్ని 72 గంటల్లోపు మూసివేయాలని అమెరికా దేశం ఆదేశించింది.

మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయని గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎడిటర్ జిజిన్ బుధవారం ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా రాయబార కార్యాలయం ప్రాంగంణం వద్ద భారీగా పేపర్లు, పైళ్లను తగులబెట్టడంతో పొగబారింది. దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకున్నా, వాటిని చైనా సిబ్బంది లోనికి అనుమతించలేదు. అమెరికా ఆదేశం మేరకు ఇవాళ సాయంత్రం కల్లా ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు.

You might also like