హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మంత్రి హరీష్ రావును ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక నేతలు కలిశారు. ఈ సందర్భంగా జూన్ నెల నుంచి పూర్తి వేతనం ఇవ్వాలని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు ఈ నెల నుంచి పూర్తి జీతాలు ఇవ్వడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. కాగా బకాయి వేతనాలను కూడా నగదు రూపంలో చిల్లించాలని పెన్షనర్ల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. కాగా పీఎఫ్ లో కలిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.