FbTelugu

ప్రమాదంలో భారత ప్రాజెక్టులు: ఐరాస

న్యూఢిల్లీ: భారత్ లో మరో 5 ఏండ్లలో వెయ్యికి పైగా డ్యామ్ లు యాబై ఏండ్లు పూర్తి చేసుకొని ప్రమాద స్థాయికి చేరుకున్నాయని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో తెలిపింది. ఇది ప్రపంచానికే పెను విపత్తు కావచ్చని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1930 నుంచి 1970 మధ్య 58,700 ఆనకట్టలు నిర్మితం అయ్యాయని, వీటన్నింటి వయసు 50 నుంచి 100 సంవత్సరాలు మాత్రమేనని గుర్తు చేసింది.

20వ శాతబ్దంలో నిర్మించిన ఈ ఆనకట్టల కింద కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్నారని, ఎన్నో పట్టణాలు, గ్రామాలు ఉన్నాయని, వారందరి జీవితాలూ ప్రమాదంలో పడనున్నాయని పేర్కొంది. 50 ఏళ్లు దాటితే ప్రాజెక్టు వయసు ముగిసినట్టుగానే భావించాలని పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.