FbTelugu

 కరోనాపై నేడు కేంద్ర మంత్రుల భేటీ

ఢిల్లీ: కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) నేడు సమావేశం కానున్నది. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.
ఉదయం 11 గంటలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ నేతృత్వంలో 18వ జీఓఎం సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో హోం, విదేశాంగ, రైల్వే, రవాణా, విమానయాన, పెట్రోలియం, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ సహా వివిధ మంత్రిత్వశాఖల మంత్రులు పాల్గొననున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి, కట్టడి చర్యలు, రాష్ట్రాలకు కేంద్రం సహకారం, ఆసుపత్రుల్లో సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో నియంత్రణ తదితర అంశాలపై చర్చించి మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. కరోనా ప్రభావంతో ఉపాధి లేని పేదలకు కేంద్రం అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు పై చర్చించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.