FbTelugu

కేంద్రమంత్రి ఇంగితం లేకుండా మాట్లాడారు: కేటీఆర్

హైదరాబాద్: బీజేపీ నేతలు గోబెల్స్ కు కజిన్ బ్రదర్స్ లా వ్యవహరిస్తున్నారని, బీజేపీ వాళ్ళ చార్జీ షీట్ గోబెల్స్ డైరీ లా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ. రామారావు విమర్శించారు.
కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారని, టీఆర్ఎస్-ఎంఐఎం సర్కార్ అని అర్ధ సత్యాలు మాట్లాడారన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో కేటీ.రామారావు మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటు వాద పార్టీ పీడీపీ తో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిజం కాదా ?. అసలు మా మీద చార్జీ షీట్ వేసే హాక్కు బీజేపి కి ఎవరిచ్చారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ఆరేళ్లలో ప్రగతి పథాన దూసుకు పోతున్నందుకా మా మీద చార్జీ షీటూ ?. 2000 సంవత్సరం లో ఏర్పాటైన రాష్ట్రాల కంటే 2014 లో ఏర్పాటైన తెలంగాణ అన్నింటా ముందుకు దూసుకు పోతున్నందుకా చార్జీ షీటూ వేశారా అంటూ కేటీఆర్ నిలదీశారు.

బీజేపీ మీద చార్జీ షీట్ వేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి. నా ప్రశ్నలకు సూటి, సుత్తి లేకుండా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మిగతా మంత్రులు సమాధానం చెప్పాలి. హైదరాబాద్ కు రాజ్యాంగ బద్దంగా ఇవ్వాల్సినవి కాకుండా ఒక్క పైసా అదనం గా కేంద్రం నుంచి ఇచ్చారని చెప్పగలరా ?. లాభాల్లో ఉన్న కేంద్ర సంస్థలను అమ్ముతున్నందుకు బీజేపీ మీద చార్జీ షీట్ వేయాలి. దేశ ప్రయోజనాల కోసమా డిజిన్వెస్టు మెంటు అని చెబుతున్నారు ..కొందరు గుజరాత్ పెద్దల కోసం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రధాని మోదీ ప్రతీ ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని వేయనందుకు ఛార్జీ షీట్ వేయాలి. మొత్తం 132 కోట్ల ఛార్జీ షీట్లు వేయాలి బీజేపీ మీద. జీడీపీ ని తిరోగమన దిశలో తీసుకెళ్లినందుకు బీజేపీ మీద వెయ్యాలి. పీడీపీ వంటి వేర్పాటు వాద పార్టీ తో పొత్తు తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ మమ్మల్ని వేర్పాటు వాద పార్టీ అంటారా?ఈ అబద్ధాలకు బీజేపీ మీద వెయ్యాలి. కొత్త వ్యవసాయ బిల్లులు తెచ్చినందుకు తెలంగాణ రైతులు వెయ్యాలి బీజేపీ మీద చార్జీ షీట్ వేయాలన్నారు.

ఇప్పటికైనా విజ్ఞులైన హైద్రాబాద్ ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ మేయర్ అవుతారన్నారు. బీజేపీ నేతలు పచ్చ కామెర్లు వచ్చిన వారిలా ఎంఐఎం మేయర్ అవుతారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేము మొదటి స్థానం లో ఉంటామని, ఎంఐఎం రెండో స్థానం లో ఉంటుందని… మిగతా స్థానాలు మిగతా పార్టీలు తేల్చుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.