FbTelugu

80శాతం రైళ్లు నడుస్తున్నాయి: కేంద్ర మంత్రి పీయుష్

తిరుమల: లాక్ డౌన్ తరువాత క్రమంగా దేశంలో రైళ్లను పునరుద్దరించామని, ప్రస్తుతం 80 శాతం రైళ్లు నడుస్తున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు.
కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో మిగతా దేశాలకు ఆదర్శంగా నిలిచామని, భారత్ లో తయారవుతున్న వ్యాక్సిన్లను 75 దేశాలకు పంపిణీ చేశామని పీయుష్ అన్నారు.

దేశంలో కరోనా ప్రభావం తగ్గలేదని, వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగిసే వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం కచ్చితంగా పాటించాలని, ముఖ్యంగా రైల్వే ప్రయాణీకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని తిరుపతి రైల్వేస్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తిరుపతికి మరిన్ని రైళ్లు నడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పీయూష్ గోయల్ చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.