FbTelugu

జడ్జీలను తిట్టే ధోరణి పెరిగింది: కేంద్ర మంత్రి రవిశంకర్

పాట్నా: న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని పరుష పదజాలంతో దూషించే ధోరణి ఈ మధ్య ఎక్కువైందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయమూర్తుల పట్ల వ్యక్తిగత దూషనలకు దిగుతుండడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాట్నాలో నూతనంగా నిర్మించిన హైకోర్టు నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ హాజరయ్యారు.
కేసులపై ఇచ్చే తీర్పును మనం తప్పు పట్టవచ్చని, ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని దూషించడం సరికాదని రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ వివాదాలకు సోషల్ మీడియా ప్రధానంగా వేదికగా మారిందన్ ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియా ఉచితంగా లభించడంతో ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

స్వేచ్ఛ ఉంది కదా అని కొందరిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ సోషల్‌మీడియాను దుర్వినియోగం చేయడం సరైంది కాదన్నారు. సోషల్‌మీడియా వేదికగా ఎవరైతే దూషణలు ఎదుర్కొంటారో వారికి పరిష్కార వేదిక ఉండాల్సిందేనన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ఆల్‌ ఇండియా జుడీషియల్‌ సర్వీసెస్‌ (ఎఐజెఎస్) ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.