FbTelugu

ముగ్గురు బెంగాల్ ఐపీఎస్ లపై కేంద్రం కన్నెర్ర

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా పశ్చిమ బెంగాల్ పర్యటనలో భద్రతా వైఫల్యాలకు బాధ్యత వహించాలంటూ కేంద్ర హోం శాఖ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలకు ఉపక్రమించింది.

పశ్చిమ బెంగాల్ లో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్ర సర్వీసులోకి రావాల్సిందిగా హోం శాఖ సమన్లు పంపించింది. నడ్డా పర్యటనలో భద్రతా వైఫల్యానికి ముగ్గురు ఐపీఎస్ అధికారులు బాధ్యత వహించాలని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ చర్య సీఎం మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదంగా మారే ప్రమాదముంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేయడానికి సీబీఐ, ఈడీ అధికారులు రాగా మమతా అడ్డుకున్న విషయం తెలిసిందే.

సాధారణంగా రాష్ట్ర సర్వీసులకు కేటాయించిన అధికారులను వెనక్కి పిలిచే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకే కేంద్రంలో డిప్యూటేషన్ పై పంపిస్తారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సందర్భంలో ఈ చర్యలకు కేంద్రం ఉపక్రమిస్తుంది. గతంలో కూడా తమిళనాడు లోజయలలిత ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రధాన కార్యదర్శిని కూడా కేంద్రం వెనక్కి పిలిపించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.