FbTelugu

ఏపీకి ప్రత్యేకం లేదు హోదా లేదు: కేంద్రం

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రకటించారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.

టిడిపి ఎంపి కె.రామ్మోహన్‍ నాయుడు లోకసభలో వేసి ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‍రాయ్ సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామన్నారు. ఏపీ విభజన తరువాత తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయన్నారు. రెండు రాష్ట్రాల మధ్యనున్న సమస్యల పరిష్కారం మా చేతుల్లో లేదన్నారు. వాటిని తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలిని కేంద్ర మంత్రి నిత్యానంద్‍రాయ్ తేల్చి చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.