FbTelugu

కలిసేందుకే ఈటల ఫోన్ చేశాడు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి లో చేరతారనే వార్తలు గుప్పుమనడంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. ఇవాళ మీడియాతో ఆయన చిట్ చాట్ వేస్తూ ఈటల రాజేందర్ విషయాన్ని వివరించారు

తనను ఈటల కలవలేదని, వ్యక్తిగతంగా కలిసేందుకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని కిషన్ రెడ్డి తెలిపారు. అందరినీ కలుస్తున్నా, మిమ్మల్నీ కూడా కలుస్తానని అని నాతో చెప్పారన్నారు. ఆయన నేను పదిహేనేళ్లు కలిసి పనిచేశామని, వ్యక్తిగతంగా కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తనతో భేటీ అయినంత మాత్రాన పార్టీలో చేరేందుకు కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే చూద్దామన్నారు. అక్కడ పోటీ అంశంపై ఇంకా చర్చించలేదని, పార్టీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.