FbTelugu

కేంద్ర హోం మంత్రి మిస్సయ్యాడా?. పోలీసులకు ఫిర్యాదు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాడ కన్పించడం లేదంటూ ట్విటర్ లో హోరెత్తుతున్నది. అమిత్ షా మిస్సింగ్ అనే యాస్ ట్యాగ్ తో గురువారం నాడు 500కు పైగా ట్వీట్లు చక్కర్లు కొట్టాయి.
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ), ట్విటర్ ప్రకారం ఆయన జాడ మాత్రం తెలియడం లేదు. యావత్ దేశం కరోనాపై యుద్దం చేస్తుంటే హోం మంత్రి మిస్సింగ్ ఇన్ యాక్షన్ అంటూ ట్వీట్లతో హోరెత్తించారు.

ఎన్.ఎస్.యు.ఐ కార్యదర్శి నగేష్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు బుధవారం నాడు ఎన్.ఎస్.యు.ఐ కార్యాలయానికి వెళ్లారు. సెకండ్ వేవ్ లో దేశం చిక్కుకున్నదని, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని నగేష్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో చర్యలు తీసుకోవాల్సిన అమిత్ షా కన్పించడం లేదంటూ ఫిర్యాదులో తెలిపాడు. కేంద్ర మంత్రులు ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పాలని, సేవ చేయకుండా పలాయనం చిత్తగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జవాబుదారితనం కేవలం బిజెపికి కాదని దేశ ప్రజల పట్ల తప్పనిసరిగా ఉండాలన్నారు. అమిత్ షా చివరగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కన్పించారని, అప్పటి నుంచి ఆయన జాడ లేదని నగేష్ పోలీసులకు తెలిపాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.