FbTelugu

మావోలను ఏరేయాలి: హోం మంత్రి అమిత్

రాయపూర్: రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా సమూలంగా ఏరివేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భధ్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించేందుకు అమిత్ షా జగదల్ పూర్ చేరుకున్నారు.

ముఖ్యమంత్రి భూపేష్ భాగల్ తో కలసి అమిత్ షా జవాన్ల పార్థీవ దేహాలకు నివాళులు అర్పించారు. మావోల దాడిలో ఇప్పటి వరకు 24 మంది జవాన్లు చనిపోగా 14 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. శ్రీలంకలో ఎల్టిటిఈ ని అంతమొందించిన విధంగానే మావోయిస్టులను ఆనవాళ్లు లేకుండా ఏరిపారేయాలని అమిత్ షా భద్రతా బలగాలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రతీకారం తీర్చుకోవాలని, ఏ విధమైన సాయం కావాలన్నా ప్రభుత్వం నుంచి అందచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే దండకారణ్యాన్ని నలువైపాలా భద్రతా బలగాలు చుట్టుమట్టాయి. మావోయిస్టులను సమూలంగా ఏరివేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.