FbTelugu

జగన్ వేధింపులు సరికాదు: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: ఏపిలో టివి ఛానళ్ల పై జగన్ ప్రభుత్వం కేసులు బనాయించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

సమాచారాన్ని ప్రజలకు చేరవేసే బాధ్యత నెరవేరుస్తున్న మీడియాపై కేసుల బనాయింపు సరికాదన్నారు. ఏపిలో మీడియా సంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న అంశాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశాలు మినహా ఇతర రాజకీయ కారణాలతో మీడియా పై రాజద్రోహం కేసు మోపడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై అనేక మీడియా సంస్థలు తీవ్ర విమర్శలు చేసినప్పటికీ ఏనాడు వారిపై ఆంక్షలు విధించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాపై ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టారన్న వార్తలపై సంబంధిత శాఖ తో చర్చిస్తానని హోంశాఖ సహాయ మంత్రి, కిషన్ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.