FbTelugu

అకారణ నింద… రూ.550 కోట్ల పరిహారం

న్యూయార్క్: మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేశారనే అభియోగంపై జైలు శిక్షను అనుభవిస్తున్న ఇద్దరు నల్ల జాతీయులకు అనుకూలంగా తీర్పు లభించింది. చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న ఇద్దరికి రూ.550 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

హెన్నీ మెక్ కాలమ్, లియోన్ బ్రౌన్ సోదరులను అమెరికా పోలీసులు 1983లో అరెస్టు చేశారు. 11 సంవత్సరాల బాలికను రేప్ చేసి హత్య చేశారని అభియోగం మోపారు. విచారణ తరువాత వారికి కోర్టు అప్పట్లో జైలు శిక్ష విధించింది. కాగా 2014లో చేసిన డిఎన్ఏ పరీక్షలో అసలు నిజం వెలుగుచూడ్డంతో ఇద్దరూ ఊపిరిపీల్చుకున్నారు. విచారణ పేరుతో మూడు దశాబ్ధాలుగా శారీరకంగా, మానసికంగా వేదనకు గురయ్యామని భావించిన ఇద్దరు 2015లో నార్త్ కరోలినా కోర్టులో పిటీషన్ వేశారు. తమ తరఫున ఒక న్యాయవాదిని నియమించుకున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, చేయని తప్పుకు మూడు దశాబ్ధాలుగా జైలు శిక్షను అనుభవించారని వారి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. విలువైన జీవితాన్ని కోల్పోవడంతో పాటు సంఘంలో తలెత్తుకోకుండా చేశారని, మూడు దశాబ్ధాలుగా జైలులో మగ్గినందున పరిహారం చెల్లించాలని కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనల తరువాత నార్త్ కరోలినా కోర్టు ఇద్దరికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఇరువురికి రూ.550 కోట్ల పరిహారం చెల్లించాలని తుది తీర్పును ఇస్తూ కేసు కొట్టివేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.