FbTelugu

తెలంగాణలో ఊహించని మద్యం విక్రయాలు

హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా మందు బాబులు ఇళ్లల్లోనే మద్యాన్ని మంచినీళ్లలా మింగేశారు. నాలుగు రోజుల్లో రూ.759 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

తెలంగాణలో నూతన సంవత్సర పార్టీలకు అనుమతి లేకపోయినా మద్యం విక్రయాలు జోరు తగ్గలేదు. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో సుమారు రూ.759 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 8.61 కోట్ల లిక్కర్‌ కేసులు, 6.62 కోట్ల బీరు కేసులు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు రూ.200 కోట్ల అధిక ఆదాయం సమకూరింది.

డిసెంబర్‌ 28వ తేదీన రూ.205.18 కోట్లు, 29న రూ.150 కోట్లు, 30న 211.35 కోట్లు, 31వ తేదీన రూ.193 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ లెక్కలను బట్టి స్పష్టమవుతోంది. ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రూ.50.78 కోట్లు, ఖమ్మం జిల్లాలో 52.70 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.47.78 కోట్లు, మెదక్‌లో రూ.53.87 కోట్లు, నల్గొండలో రూ.75.98 కోట్లు, నిజామాబాద్‌ జిల్లాలో రూ.37.5 కోట్లు, వరంగల్‌లో రూ.63.49 కోట్ల విక్రయాలు జరిగాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.