FbTelugu

రేపోమాపో నిరుద్యోగ భృతి ప్రకటిస్తాం: కేటీఆర్

కేసీఆర్ భిక్షతోనే ఉత్తమ్, సంజయ్ కు పదవులు
హైదరాబాద్: సోలార్ విద్యుత్ లో రెండో స్థానంలో ఉన్నామని, వాయు వేగంతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. నిరుద్యోగ భృతి రేపో మాపో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ఆయన తెలిపారు.
సాగు తాగు నీరు ఇస్తున్నామని, సీఎం కేసీఆర్ ఈ ఆరున్నర ఏళ్లలో అన్ని పూర్తి చేశారన్నారు. కొత్తగా 50 వేల ఉద్యోగాలు కూడా ప్రకటించారు అవి కూడా భర్తీ చేస్తామన్నారు. నిన్న ఇవాళ కొంత మంది పనికిరాని ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఒకరు టీపీసీసీ చీఫ్ కాగా మరొకరు టీ బీజేపీ అధ్యక్షుడు అన్నారు. కేసీఆర్ పెట్టిన భిక్ష తోనే వారికి పదవులు వచ్చాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ తీసుకురావడం మూలంగానే ఉత్తమ్ కుమార్ పీసీసీ అధ్యక్షుడు, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని కేటీఆర్ తెలిపారు.

ఈ విషయాన్ని ఆ నాయకులు గుర్తు పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. అనే పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పై అవాకులు చెవాకులు పేలుతూ ఇష్టానుసారంగా మాట్లాడిన వీరిని మీరు తప్పక తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. రాష్ట్ర సాధనకు మీరు ఏ విధంగా ఉద్యమం చేశారో అదే మాదిరి వీరి విమర్శలను కూడా తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.