FbTelugu

యూఎస్ లో నిరుద్యోగ భృతి దరఖాస్తుల వెల్లువ

న్యూయార్క్: అగ్రరాజ్యంలో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. కరోనా సృష్టించిన కల్లోలంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగింది. వారం రోజుల క్రితం నిరుద్యోగ భృతి కోసం 7.16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా గురువారం నాటికి 8.53 లక్షలకు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాలు అంటున్నాయి. కాలిఫోర్నియాలో 47వేలు, ఇల్లినాయిస్ లో 31వేలు, న్యూయార్క్ లో 17వేలు, జార్జియాలో 13వేల చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. టెక్సాస్ లో వారం రోజుల క్రితం 20వేల మంది దరఖాస్తు చేయగా, ఇప్పుడా సంఖ్య 45వేలకు పెరిగింది.

వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు అమెరికా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు పరుస్తున్నది. దీంతో పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు ఖర్చు తగ్గించుకునే క్రమంలో సగం మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కరోనా ప్రతి రోజు రెండు లక్షల మందికి పైగా సోకుతుండగా, మూడు వేల మందికి పైగా మరణిస్తున్నారు. సుమారు మూడు లక్షల మంది ఈ మహమ్మారి కారణంగా చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.