FbTelugu

పత్తాలేని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి

నాగార్జున సాగర్: కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన యోధుడనని చెప్పుకుంటున్న నాగార్జున సాగర్ అభ్యర్థి కె.జానారెడ్డి పత్తా లేకుండా పోయారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదటి నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో ఉన్నారు.

ఇప్పటి వరకు పన్నెండు రౌండ్లు పూర్తి కాగా ఏ రౌండ్ లోనూ జానారెడ్డి ఆధిక్యం కనబర్చకపోవడం శోచనీయమని కాంగ్రెస్ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. 12వ రౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 10361 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. గాంధీ భవన్ లో కూర్చుని గెలుస్తానని బీరాలు పలికిన జానా రెడ్డి, ఫలితాలు వెల్లడి అవుతున్నా అడ్రస్ లేకపోవడం పట్ల టిఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. సీనియర్ నాయకుడనని చెప్పుకోవడం కాదు, సత్తా చూపించాలని అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.