FbTelugu

వివరణ ఇవ్వాలి.. విరుచుకుపడొద్దు: ఉండవల్లి

రాజమండ్రి: ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తాజా పరిణామాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరున్ కుమార్ స్పందించారు. ఈ సంధర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇసుక, ఇంగ్లీష్ అంశాలపై స్పందిస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాన్ లు ప్రతిపక్షాలుగా వారి పాత్ర పోషిస్తున్నారన్నారు. 151 సీట్లు ఉన్న అధికార వైసీపీ నాయకులు సమస్యపై వివరణ ఇవ్వాలే కానీ.. ఇలా ప్రతిపక్షాలపై విరుచుకుపడొద్దని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు విభజన జరిగిన తీరుపై చర్చకు నోటీసులు ఇవ్వాలన్నారు. తెలుగు భాష వివాదంపై నీకు ఎంత మంది పెళ్లాలు, నువ్వు మట్టి కొట్టుకు పోతావనే విమర్శలు కూడా అనవసరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటూ ప్రైవేట్ పాఠశాలలో కూడా తెలుగు తప్పనిసరి అని నిబంధన పెట్టాలన్నారు. అధికార పార్టీ వారు విమర్శలతో విరుచుకుపడకుండా.. ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ పై శిక్షణ ఇవ్వడం, పాఠశాలలో ఇంగ్లీష్ తప్పనిసరి చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు.

You might also like