FbTelugu

చావులోనూ వీడని బంధం

రంగారెడ్డి: అన్న చనిపోయాడన్న వార్త తెలుసుకుని అన్న మృతదేహం వద్ద తమ్ముడు కూడా కుప్పకూలి చనిపోయిన ఘటన శంషాబాద్ లో చేసుకుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి కాలనీలో నివసించే రాచమల్ల సుదర్శన్ కు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది.

గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపే సుదర్శన్ మరణించాడు, తన సహోదరుడు మరణించాడని సమాచారం అందుకున్న సుదర్శన్ తమ్ముడు లావన్ తన అన్న మృతదేహం వద్ద కుప్పకూలి చనిపోయాడు. దీంతో సిద్ధాంతి కాలనీలో విషాదం నెలకొంది. రెండు కుటుంబాలకు చెందిన వారు బోరు బోరున విలపించారు.

You might also like