FbTelugu

దివ్య కేసులో నమ్మలేని నిజాలు

విజయవాడ: దివ్య తేజస్విని హత్య కేసు దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యింది. ఇప్పటి వరకు దివ్య తేజస్విని మర్డర్ కేసును మాచవరం పోలీసులు విచారించారు.

నాగేంద్ర మాస్టర్ ప్లాన్ కు ఆమె బలైన విషయం విదితమే. ఈ కేసును పోలీసులు లోతుగా విచారించే కొద్ది నమ్మలేని నిజాలు అశ్చర్యపరుస్తున్నాయి. నాగేంద్ర ను ఆమె దూరం పెట్టడంతో.. కోపం పెంచుకున్నాడు. దివ్వ స్నేహితుల సహాయంతో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నకిలీ అకౌంట్ సృష్టించి వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా కు వచ్చారు. స్నేహితుల్లో కొద్ది మందికి మాత్రమే అమె ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తెరిచేందుకు అనుమతించింది. దివ్య ఫోన్ ను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.
దివ్య ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అనుమతి ఉన్న స్నేహితుల జాబితా ను ఇప్పటికే సిద్దం చేశారు. సెల్ఫీ వీడియో లో చెప్పిన విధంగా ఆ సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు? అతనికి సహకరించిన అమె స్నేహితురాలు ఎవరు? అనే దాని పై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.