FbTelugu

అప్పు చెల్లించలేక కుటుంబాన్నే మట్టుబెట్టాడు

చెన్నై: అప్పు ఇచ్చిన పాపానికి ఒక కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణ ఘటన ఏరోడ్ లో జరిగింది.
ఏరోడ్ లో కరుప్పన కౌందేర్ (72) నుంచి కిజ్వాని గ్రామానికి చెందిన ఆర్.కల్యాణ సుందరం (43) రూ.15 లక్షలు అప్పు తీసుకున్నారు. గడువు ప్రకారం బాకీ చెల్లించకపోవడంతో కౌందేర్ ఒత్తిడి పెంచాడు. డబ్బులు చెల్లించకుండా తప్పించుకునేందుకు కౌందేర్ కుటుంబాన్ని ఖతం చేయాలని సుందరం నిర్ణయించాడు.

ఇందుకోసం తన స్నేహితులు శబరి (25) సాయం తీసుకున్నారు. హెల్త్ వర్కర్ నని చెప్పి జూన్ 26న కౌందేర్ నివాసానికి శబరి వెళ్లాడు. రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చెప్పి కొన్ని మాత్రలు ఇవ్వగా కౌందేర్ తో పాటు, ఆక్ష్న మల్లిక, కుమార్తె దీప, పని మనిషి కుప్పల్ తీసుకున్నారు. ఆ తరువాత కొద్ది సేపటికే అస్వస్థతకు గురికావడంతో పొరుగువాళ్లు అంబూలెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు చనిపోగా, కౌందేర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.