FbTelugu

కేసీఆర్ కు నిరసన సెగ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు నిరసన సెగ తగిలింది. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపం వద్దకు చేరుకోగానే ఒక నిరుద్యోగి సీఎం కాన్వాయ్ పైకి దూసుకు వచ్చాడు.

తనకు ఉద్యోగం కావాలని గట్టిగా అరిచాడు. వెంటనే అప్రమత్తమైన సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆ నిరసనకారుడిని అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా గన్ పార్క్ వద్ద అలజడి చోటు చేసుకున్నది. ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ కు చేరుకున్నారు. అమరవీరుల స్మారకస్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించి వెళ్లిపోయారు.

hyd gun parkts cm camp office

అంతకు ముందు ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.

You might also like