FbTelugu

వ్యాక్సిన్ తీసుకున్న ఐరాస సెక్రెటరీ జనరల్

న్యూయార్క్: ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ పై మరింత నమ్మకం పెంచేందుకు, అపప్రదలను తొలగించేందుకు ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు.

ఏడు పదులు దాటిన ఆయన నగరంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ తరువాత విజయం చిహ్నం చూపుతూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తమ సంస్థను భాగస్వామ్యం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పౌరుడికి, ప్రతిచోటా వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంటోనియో ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.