FbTelugu

ఎంపీ కేశినేనిపై బొండా, బుద్దా ఫైర్

విజయవాడ: బెజవాడ టీడీపీలో విభేధాలు భగ్గుమన్నాయి. విజయవాడలో టీడీపీ ని కుల సంఘం గా ఎంపీ కేశినేని నాని మార్చుతున్నాడని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్ రావు, బుద్దా వెంకన్నలు తీవ్ర విమర్శలు చేశారు. వంగవీటి మోహన రంగాను హత్య చేసిన నిందితుడికి తన ఇంట్లో విందు ఇచ్చారన్నారు.

జిల్లాలో కేశినేని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, మాకు ఏ గొట్టం గాడు అధిష్టానం కాదని వారు స్పష్టం చేశారు. నాని ఉంటే చంద్రబాబు విజయవాడ ఎన్నికల పర్యటనలో మేము పాల్గొనమని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో పనిచేయమని కూడా చెప్పారు. చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడిన నానిని ఆరోజే చెప్పుతో కొట్టాలని అనుకున్నానని బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని కి దమ్ముంటే ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేసి, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. రంగా హత్య చేసిన నిందితులను నాని వెంటపెట్టుకుని ప్రచారం చేస్తున్నారన్నారు. ఒంటెద్దు పోకడలతో వెళ్తున్న కేశినేని ని చంద్రబాబు కంట్రోల్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.