FbTelugu

బీజేపీ కి మరో మిత్రపక్షం ఆల్టిమేటం

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మరో మిత్రపక్షం ఆల్టిమేటం జారీ చేసింది. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుతామని రాజస్థాన్ కు చెందిన లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్.ఎల్.పీ) అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. దేశ రాజధాని నగరంలో రైతులు చలిలో దీక్షలు చేస్తుంటే కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. రైతుల డిమాండ్లపై వెంటనే స్పందించి ఒక నిర్ణయానికి రావాలని బేనివాల్ డిమాండ్ చేశారు. ఇప్పటికే పంజాబ్ కు చెందిన శిరోమణి అకాళీదళ్ పార్టీ బీజేపీ కి గుడ్ బై చెప్పింది.
రాజస్థాన్ లోని 15 పార్లమెంటు నియోజకవర్గాల్లో బేనివాల్ పార్టీకి ప్రాభల్యం ఉంది. ఛలో ఢిల్లీ ఉద్యమానికి లోక్ తాంత్రిక్ పార్టీ మద్దతు ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.