FbTelugu

అనుభవించక తప్పదు…: రంగం భవిష్యవాణి

హైదరాబాద్: ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు రా.. అని భవిష్యవాణిలో స్వర్ణలత స్పష్టం చేసింది.
ప్రజలను కాపాడుకుందాం అనుకున్నా… కానీ మీ చేతులారా చేసుకుంటున్నారు అని విచారం వ్యక్తం చేసింది. ఇవాళ ఉదయం ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయం ముందు స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. రాబోయే రోజులు కష్టాలు, నష్టాలతో ఉంటాయని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ ఏడాది ఉత్సవాలు ఏమాత్రం తనకు సంతోషంగా లేవని ఆమె అన్నారు.

రాబోయే రోజులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి… ఈ విషయాన్ని ముందుగానే హెచ్చరిస్తున్నాను అని తెలిపింది. నా భక్తులనీ , నా బిడ్డలను కాపాడుకుంటానని అయితే 5 వారాలు పూజలను కోరారు. ప్రతి గడప నుంచి శాఖ, పప్పు బెల్లాలు అమ్మావారికి సమర్పించాలన్నారు. కామంతో కాకుండా భక్తి భావనతో చేయాలని స్వర్ణలత ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.