FbTelugu

తిరుమలలో ఉగాది ఆస్థానం

తిరుమల: శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీన మంగ‌ళ‌వారం శ్రీ ఫ్ల‌వ‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు.
ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని ఏప్రిల్ 13వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన (వ‌ిర్చువ‌ల్ సేవ‌లు) కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాల‌ను రద్దు చేసినట్లు టిటిడి ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.