FbTelugu

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం

కర్నూలు: శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున దేవాలయంలో ఉగాది మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీన ముగియనున్నాయి. కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ ఉగాది మహోత్సవాల నిర్వహిస్తున్నారు.
ఈ రోజు ఉదయం 8.00గంటలకు యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ చేసి శ్రీకారం చుట్టారు. ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ జరుగుతోంది. శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం చేయనున్నారు. సాయంత్రం 5.30గంటల నుండి అగ్నిప్రతిష్ఠాపన, అంకురార్పణ చేస్తారు. రాత్రి 7.00గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు భృంగి వాహనసేవ పూజలు జరగనున్నాయి.
అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం చేసి రాత్రి 7.30 గంటల నుండి పురవీధుల్లో గ్రామోత్సవం జరుపుతారు. రాత్రి 8.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ చేస్తారు.

తిరుమలలో 39వేల భక్తుల దర్శనం…
తిరుమల: శ్రీవారిని శుక్రవారం నాడు 39,085 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు రూ.1.75 కోట్లు. నిన్న 22,750 మంది తలనీలాలు సమర్పించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.