FbTelugu

నిరాడంబరంగా ఉగాది వేడుకలు

హైదరాబాద్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బోగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో శ్రీ శర్వారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి.

కరోనా వైరస్ ప్రభావంతో అత్యంత నిరాడంబరంగా ఈ వేడుకలు జరిగాయి. ప్రతి సంవత్సరం రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో సీఎం తో మంత్రులు, కవులు, పండితులు పాల్గొంటారు. ఇండియా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరపాలని నిర్ణయించారు.

దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్భంగా శ్రీ శార్వరి నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. భాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఉగాది  పంచాంగ శ్రవణం చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More