FbTelugu

డెలీవరీ బాయ్ గా ఉబెర్ సిఈఒ

ఉబెర్ సిఈఓ దారా ఖొస్రోషాహి పుడ్ డెలీవరీ బాయ్ అవతారమెత్తాడు. సైకిల్ మీద తిరుగుతూ ఫుడ్ డెలీవరీ చేసినట్లు ఆయనే ట్వీట్ చేసి తెలిపారు. ఇది చూసిన పలువురు బాగుందంటూ కామెంట్లు మరికొందరు తనకింద పనిచేసే వారిని మనుషుల్లా చూడాలని కామెంట్లు పెట్టారు.

అప్పడప్పుడు దారా గ్రౌండ్ లోకి వచ్చి వర్కర్ల పనితీరును పరిశీలించేందుకు ఫుడ్ డెలీవరీ బాయ్ గా అవతారమెత్తుతాడు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సైకిల్ మీద తిరుగుతున్న ఫొటోను ట్విటర్ లో షేర్ చేశారు. ఆ రోజు ఏం చేసింది తెలిపాడు. ఒక రోజు సంపాదన వంద డాలర్లు అని వెల్లడించాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొందరు హేళన చేశారు. మరికొందరు చేసింది చాలు, తన వద్ద పనిచేసే వారికి మంచిగా జీతాలు ఇచ్చి మనుషుల్లా చూడాలని సున్నితంగా మందలించారు. మొత్తానికి పబ్లిసిటీ స్టంట్ ఉబెర్ సిఈఓ పరువు తీసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.