FbTelugu

5 లక్షల మరణాలకు చేరువలో యూఎస్

వాషింగ్టన్: అమెరికాలో 24 గంటల క్రితం వరకు కరోనా వైరస్ బాధితుల మరణాల సంఖ్య 4.98 లక్షలకు చేరుకున్నది. సోమవారం నాటికి ఆ సంఖ్య ఐదు లక్షలకు దాటవచ్చని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదికలు చెబుతున్నాయి.

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అమెరికా కరోనా మరణాలు సంభవించాయి. అగ్రరాజ్యం ఈ వైరస్ తో విలువైన ప్రాణాలను కోల్పోయి విలవిల్లాడుతున్నది. దేశ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా నిలిచిపోయింది. సుమారు 102 సంవత్సరాల క్రితం ఇన్ ఫ్లుయాం మహమ్మారి విలయంతో పెద్ద ఎత్తున జనం చనిపోయారు. ఆ తరువాత ఇప్పుడే మళ్లీ పెద్ద సంక్షోభం వచ్చిందని అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంటనీ ఫౌచీ వెల్లడించారు. గతేడాది అమెరికాలో తొలి కరోనా మరణం నమోదు కాగా అప్పటి నుంచి మరణమృదంగం కొనసాగుతునే ఉన్నది. కొన్ని పట్టణాలకు వెళ్లాలంటే ఇతర దేశాల వారు హడలే పరిస్థితి ఏర్పడింది.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయే నాటికి అక్షరాలా 4 లక్షల మంది చనిపోయారు. ట్రంప్ ప్రభుత్వం ఉదాసీన వైఖరి కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిశాయని, సీనియర్ సిటిజన్ల ఆరోగ్యానికి భద్రత లేకుండా పోయిందనేది తేటతెల్లమైంది. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య సోమవారం నాటికి 5 లక్షలకు చేరిన సందర్భంగా వైట్ హౌస్ లో నూతన అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ మృతులకు నివాళులు అర్పించనున్నారు. యూఎస్ లో ఇప్పటి వరకు 2.80 కోట్ల మంది కరోనా బారినపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.