FbTelugu

ట్రంప్ కు షాకిచ్చిన యూఎస్ కాంగ్రెస్

ఈ నెల 20 జోసెఫ్ ఆర్.బైడెన్ ప్రమాణం
ఇక డొనాల్డ్ ట్రంప్ ఇంటికే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందినట్లు యూఎస్ కాంగ్రెస్ ధృవీకరించింది. క్యాపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ మద్దతుదారులు దాడులకు దిగినా ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ సమావేశమైన కాంగ్రెస్ గెలుపును నిర్ధారించింది.
విజయానికి అవసరమైన 270 ఓట్లను బైడెన్ సాధించినట్లు యూఎస్ కాంగ్రెస్ ప్రకటించి ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఇవాళ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నాయకత్వంలో రెండు సభలు సంయుక్తంగా సమావేశమై గెలుపును ధృవీకరించాయి. ఈ ప్రకటనపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. తాజా నిర్ణయంతో ఈ నెల 20వ తేదీన 46వ అధ్యక్షుడిగా జోసెఫ్ ఆర్.బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అధ్యక్ష పదవిని వీడేది లేదంటూ ఇప్పటికీ ఘీంకారాలు, అల్లర్లు చేసిన ట్రంప్ కు ఈ నిర్ణయంతో గట్టి షాక్ తగిలినట్లు అయ్యింది. ఇవాళ సమావేశం జరిగే క్యాపిటల్ బిల్డింగ్ లో ట్రంప్ మద్దతుదారులు ఆందోళనకు దిగి కాల్పుల దాకా తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.