FbTelugu

ఫైజర్ వ్యాక్సిన్ కు యూఎస్ ఆమోదం

వాషింగ్టన్: ఇప్పటికే యూకె ప్రభుత్వం ఆమోదం పొందిన ఫైజర్ కంపెనీ తయారు చేసిన కొవాక్స్ వ్యాక్సిన్ కు అమెరికా నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. అత్యవసర వినియోగానికి వాడుకోవచ్చని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.డి.ఏ) అనుమతి లభించాల్సి ఉంది.

వ్యాక్సిన్ అనుమతిపై నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించగా 17 మంది అనుకూలంగా ఓటు వేయగా, నలుగురు మాత్రం వ్యతిరేకించారు. నలుగురిలో ఒకరు గైర్హాజరు అయ్యారు. బ్రిటన్ లో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు అస్వస్థతకు గురయ్యారనే వార్తలు వస్తున్నా, నిపుణుల కమిటీ ఆమోదించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

అమెరికాలో ప్రస్తుతం రోజుకు రెండు లక్షల కేసులు నమోదు అవుతుండగా, మూడు వేల మందికి పైగా మృతి చెందుతున్నారు. కేసుల సంఖ్య తగ్గించడంతో పాటు మరణాల సంఖ్యను వీలైనంతగా కుదించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరు కల్లా సుమారు కోటి మంది కి రెండు కోట్ల డోసులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైద్య సిబ్బంది, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇవ్వనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.