FbTelugu

నేను పోటీ చేస్తున్నాను: ప్రకాశ్ రాజ్

టాలీవుడ్ ఇండస్ట్రీ కోసం మువీ ఆర్టిస్ అసోసియేషన్ (మా) ఒకటి పనిచేస్తున్నది. త్వరలో జరగనున్న మా ఎన్నికల కోసం విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేయబోతున్నాడు.
తాజాగా ఒక టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు అవగాహన ఉందని, వాటిని పరిష్కరించేందుకు తన వద్ద ఆలోచనలు ఉన్నాయన్నారు.

దేశంలో ఇతర చిత్ర పరిశ్రమలతో పోల్చితే టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దదని అన్నారు. అధ్యక్షుడిగా బరిలోకి దిగుతున్నానని, గెలిపిస్తే చేయాల్సిన ముఖ్య పనులు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ వివరించారు. సొంత భవనం నిర్మాణం చేయడంతో పాటు అత్యున్నత గౌరవం తీసుకువచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు. హీరో చిరంజీవి అందరి కి కావాల్సిన వాడని, ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి మద్దతు ఇవ్వరన్నారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకోనని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.