హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ముందు హల్ చల్ చేసిన యువకులను పోలీసులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కోట్ల సాయిబాబా, సాయి కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.
ఇవాళ మధ్యాహ్నం వేర్ ఈజ్ సీఎం కేసీఆర్ అంటూ ప్లకార్డు పట్టుకుని మెరుపు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఇలా ఫ్లకార్డు పట్టుకుని అలా నిరసన తెలిపి వెళ్లిపోయిన యువకుల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలించారు. వారు ఉపయోగించిన టూ వీలర్ నెంబర్ ఆధారంగా శోధించి పట్టుకున్నారు.
సైదాబాద్ కు చెందిన కోట్ల సాయిబాబా, బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన సాయి కుమార్ గా గుర్తించారు. ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు.