FbTelugu

 రుణాలకు రెండేళ్ల మారటోరియం: కేంద్రం

ఢిల్లీ: కరోనా వైరస్ తో దేశం అతలాకుతలం అవుతోంది. జనం తిరిగేందుకు, పనులు చేసుకునేందుకు అనుమతించినా ఆర్థిక వ్యవస్థ గాడిన పడలేదు. ఇంకా కూలీలకు పనులు దొరకడం లేదు, ఉత్పత్తులు విక్రయం జరగడం లేదు.

దీంతో కేంద్ర అన్ని రకాల రుణాలకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచన లో ఉంది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు కేంద్రం తరపున తెలిపారు. కరోనా కారణంగా మార్చి నెల నుంచి లోన్ల మారటోరియం ప్రారంభమైన విషయం తెలిసిందే. మారటోరియం మార్చి 2021 వరకు కొనసాగిస్తామని కేంద్రం తెలియచేసింది. అదే విధంగా రెండేళ్ల మారటోరియంపై కసరత్తు చేస్తున్నామన్నది.

You might also like