FbTelugu

ట్రంప్ ఖాతాపై రెండేళ్ల నిషేధం

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను సోషల్ మీడియా సంస్థలు వదిలిపెట్టేలా లేవు. ఇప్పటికే ఆయన ఖాతాలపై తాత్కాలిక నిషేధం విధించిన సంస్థలు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నాయి.
ట్రంప్ ఖాతాలను రెండేళ్లపాటు నిషేధిస్తున్నట్లు ఫేస్ బుక్ వరల్డ్ అడ్మినిస్ట్రేటర్ నిక్ క్లెగ్ ప్రకటించారు.

ఆ తరువాత కొనసాగించాలా లేదా అనేదానిపై మరోసారి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఫేస్ బుక్ ద్వారా ట్రంప్ చేసిన పోస్టులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. క్యాపిటల్ బిల్డింగ్ లో జోసెఫ్ ఆర్.బైడెన్ గెలుపును చట్టసభ్యులు ధృవీకరిస్తున్న సమయంలో ట్రంప్ పోస్టులు చేశారన్నారు. కొత్తగా వచ్చిన ప్రొటోకాల్స్ ప్రకారం ఆయన మా నియమాలు తీవ్రంగా ఉల్లంఘించినందున అత్యంత కఠినమైన శిక్ష వేయాలని ఫేస్ బుక్ స్పష్టం చేసింది. ట్రంప్ ఖాతాను రెండేళ్ల పాటు నిషేధించడంపై వైట్ హౌస్ సెక్రెటరీ జెన్ సాకి మీడియాతో మాట్లాడారు. ఖాతాల నిషేధంపై నిర్ణయాలను సోషల్ మీడియా నడుపుతున్న సంస్థలకే వదిలేయాలన్నారు. తప్పుడు సమాచార వ్యాప్తిని సోషల్ మీడియా సంస్థలు కట్టడి చేయాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.