FbTelugu

వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి!

రాజన్నసిరిసిల్ల: వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని రుద్రంగి మండలం మానాలకు చెందిన

శిల్ప, కల్పన అనే ఇద్దరు మహిళలు సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే వారు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్ఓ విచారణ చేపట్టినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఆస్పత్రిని పోలీసులు సీజ్ చేసినట్టు తెలిపారు.

You might also like